అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటనలో తెలుగు తమ్ముళ్లు ఆందోళనలు చేశారు. హార్స్లీ హిల్స్ కార్యకర్తల సమావేశానికి వచ్చిన మంత్రి జనార్దన్ రెడ్డి కొండపైకి కేవలం ఇంఛార్జ్ జయచంద్ర రెడ్డి వర్గాన్ని మాత్రమే అనుమతిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం ఆందోళన చేశారు. కొండపైకి కార్యకర్తలు అందరూ వెళ్లడానికి వీలు లేదంటూ పోలీసులు అడ్డుకోవడంపై శంకర్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు.