అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా పోలీసులు రోడ్డు సేఫ్టీ డ్రైవర్ నిర్వహించారు. రోడ్ నందు నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలపైన, హెల్మెట్ వాడకం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్/ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. తప్పు చేసిన ప్రతి వాహనదారులకు భారీ జరిమానా విధిస్తామని తెలిపారు.