రాయచోటి ఘటన గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు శనివారం హెచ్చరించారు. జాతీయ భద్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా, అవాస్తవాలను సృష్టించినా, పుకార్లు ప్రసారం చేసినా, షేర్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ఓ ప్రకటనలో హెచ్చరించారు.