చిన్నమండెం మండలం బోరెడ్డి గ్రామంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి పలువురు అధికారులను ఆదేశించారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ పరిష్కారమే ప్రతి సమస్యకు తక్షణ స్పందన, పరిష్కారమే లక్ష్యం చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.