చిన్నమండెం మండలం కేశాపురం చెక్ పోస్ట్ వద్ద టమాటా లారీ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి గుర్రంకొండ మండలం తరిగొండ నుంచి టమాటాల లోడుతో నంద్యాలకు వెళుతున్న వాహనం కేశవరం చెక్ పోస్ట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో రాచంవాండ్ల పల్లెకు చెందిన వెంకటరమణ లారీ కిందపడి మృతి చెందాడు. సుండుపల్లి నుంచి వివాహానికి వెళ్తున్న ఆయన చెక్ పోస్ట్ వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.