అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నూతన ఎక్సైజ్ సీఐ గురుప్రసాద్ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో మంత్రివారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివారు కూడా సీఐకి అభినందనలు తెలియజేస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.