జూన్ 17న రాయచోటికి మాజీ ముఖ్యమంత్రి రాక

50చూసినవారు
జూన్ 17న రాయచోటికి మాజీ ముఖ్యమంత్రి రాక
జూన్ 17 న రాయచోటికి మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారని వైసిపి వర్గీయులు శుక్రవారం తెలిపారు. అనారోగ్యంతో ఉన్న ప్రముఖ వైసీపీ మైనారిటీ నేత తల్లీని మాజీ సీఎం జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత గాలివీడు రోడ్డు, మాండవ్య నది ఒడ్డున ఉన్న ప్రజా ఘాట్ లో రాజంపేట మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే దివంగత సుగవాసి పాలకొండరాయుడికి మాజీ సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. మాజీ సీఎం జగన్ సమక్షంలో మాజీ టీడీపీ ముఖ్య నేత వైసీపీలో చేరే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్