లక్కిరెడ్డిపల్లె సచివాలయ ఉద్యోగి వాజిద్ ఇటీవల విద్యుత్ షాక్ కు గురై గాయాల పాలై చికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు పై ఆరా తీసి సంబంధిత శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి క్షతగాత్రుడికి న్యాయం చేయాలని కోరారు.