చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లిలో గురువారం నుండి జరగబోయే మల్లూరమ్మ దేవత తిరణాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారి తెలిపారు. 13వ తేదీ నిండు తిరణాల, 14వ తేదీ మైల తిరణాల జరుగుతుందని తెలిపారు. భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేసి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని తెలిపారు. తిరుణాల సంబరాలకు రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వస్తున్నారని తెలిపారు.