రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గాలివీడు మండలం అరవవీడు గ్రామం, యల్లంపల్లిలో దొనకొండ గంగమ్మ తిరుణాలలో గురువారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకులు బాలాజీ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లి వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు బాలాజీ మంత్రికి పూల బొకేలతో ఘన స్వాగతం పలికారు.