గాలివీడు: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

64చూసినవారు
గాలివీడు: అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
సంక్రాంతి పండుగకు ఎవరైనా కోడిపందాలు, గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గాలివీడు ఎస్సై హెచ్చరించారు. పండుగ పూట అనవసరంగా కేసులలో ఇరుక్కొని ఇబ్బందులు పడొద్దు, మీ కుటుంబాలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన హితవు పలికారు. మండలంలో ఎక్కడైనా కానీ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్