డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని డీఆర్ మధుసూదన్రావు తెలిపారు. గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు పార్కులో డ్రగ్స్ నిర్మూలన కోసం రూపొందించిన ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ (ఈగిల్) పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటమే మన బాధ్యత అన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈగిల్ టీం ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.