రాయచోటి నియోజకవర్గం మిట్టవాండ్లపల్లికి చెందిన మైనర్ బాలిక కుటుంబ కలహాలు, ఇతర కారణంగా బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని మాజీ ఎంపీటీసీ మదనమోహన్ అన్నారు. ఆమె ఆత్మహత్యను టీడీపీ ప్రభుత్వంపై బురదచల్లడం హేయమైన చర్య అని ఖండించారు. మండిపల్లి భవన్ లో వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పై బురద చల్లే విధంగా పోస్టులు పెట్టడం వెనుక వైసీపీ శ్రేణుల కుట్రే అన్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను, నిజాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు.