జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలి

64చూసినవారు
జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలి
గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని, ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఎస్టియూ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి తెలిపారు. బుధవారం సుండుపల్లె మండలంలోని రాయవరం మడితాడు హై స్కూల్ లలో ఎస్టియూ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఉపాధ్యాయులతో సుమారు 30 సభ్యత్వాలు నమోదు చేయించామన్నారు.

సంబంధిత పోస్ట్