లక్కిరెడ్డిపల్లె: ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించిన మంత్రి

78చూసినవారు
లక్కిరెడ్డిపల్లె: ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించిన మంత్రి
రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం లక్కిరెడ్డిపల్లి మండలం, పందిళ్ళపల్లె గ్రామం, జె కొత్తపల్లిలోని రాములుగుడిలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రివర్యులు భక్తిశ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు వేదాశ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్