బీసీలపై దాడులు చేయడం అమానుషమని వైసీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి విజయభాస్కర్ అన్నారు. మంగళవారం లక్కిరెడ్డిపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి జడ్పీటీసీ, బీసీ నాయకులు రమాదేవి, రెడ్డయ్య ఇళ్లపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి బడుగు బలహీన వర్గాల ఓట్లతో గద్దెనెక్కి వారిపైనే దాడులు చేయడం తగదన్నారు.