లక్కిరెడ్డిపల్లి: బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

68చూసినవారు
లక్కిరెడ్డిపల్లి: బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం
లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట గ్రామ పంచాయతీ మరియు దప్పేపల్లి గ్రామపంచాయతీ సిబ్బంది మంగళవారం బాల్య వివాహాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు అమ్మాయికి 21 సంవత్సరాలు లోపు అబ్బాయికి వివాహం జరిగితే బాల్య వివాహము అంటారని తెలిపారు. ఈ బాల్య వివాహం వల్ల పిల్లలు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారని ఎవరైనా బాల్య వివాహాలు చేస్తే ఒక రూ. 1లక్ష జరిమానా, రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్