లక్కిరెడ్డిపల్లి మండలంలోని దొరిచెరువు వద్ద శుక్రవారం రాత్రి ఓ ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వేంపల్లి గ్రామానికి చెందిన అబూ సిద్దిక్‌కు తీవ్రగాయాలయ్యాయి. బంధువుల వివరాల ప్రకారం, ఆయన స్కూటీలో లక్కిరెడ్డిపల్లికి వస్తుండగా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. గాయపడిన అతడిని 108 ద్వారా స్థానిక ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.