వాన జాడ లేక...

80చూసినవారు
వాన జాడ లేక...
వేసవిని తలపించేలా భగభగ మండుతున్న ఎండలు... అప్పడప్పుడు మేఘాలు కమ్ముకుంటున్నా వర్షం జాడ లేక.. రోజురోజుకు భూగర్జజలాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో సాగు చేసిన పంటలన్నీ కళ్లముందు ఎండిపోవటంతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందిస్తుంటే.. మరికొందరు అప్పులు చేసి బోరు బావులను తవ్విస్తున్నారు. గత రెండు నెలల నుంచి వర్షం జాడ లేకపోవడంతో వరినార్లు పోసిన కొందరు రైతులు వదిలేశారు.

సంబంధిత పోస్ట్