వైసిపి అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడుగా పల్లపు రమేష్ ను నియమించినట్లు శనివారం పార్టీ అధ్యక్షుడు జగన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. పల్లపు రమేష్ బిసి నాయకుడుగా పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వారి సేవలను గుర్తించి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. తనపై నమ్మకంతో నియమించిన జగన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత పట్టుదల, ఉత్సాహంతో పనిచేస్తానని తెలిపారు.