రైల్వేకోడూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సకాలంలో స్పందించాలని సర్పంచ్ శివయ్య అన్నారు. ఆయన వైసీపీ బీసీ కార్యదర్శి కొర్లకుంట శివశంకర్ ను శనివారం ఆసుపత్రిలో పరామర్శించి వారికి అందిస్తున్న చికిత్సను డాక్టర్లును అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం హార్ట్ ఎటాక్ ఇంజక్షన్, పాముకాటు, కుక్కకాటు ఇంజక్షన్లు పేషెంట్స్ కు అందుబాటులో ఉంచాలని డాక్టర్లకు సూచించారు.