సంబేపల్లిలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రాయచోటి డిప్యూటీ డీఎస్వో నాగరత్నమ్మ శుక్రవారం తెలిపారు. అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా చెక్‌డ్యాములు, వ్యవసాయ బావులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ఈ వర్షాలతో ఖరీఫ్ పంటల సాగుకు రైతులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు.