రాజంపేట: అంబేద్కర్ ఆశయాలతో ప్రతి నాయకుడు ముందుకు కదలాలి

77చూసినవారు
రాజంపేట: అంబేద్కర్ ఆశయాలతో ప్రతి నాయకుడు ముందుకు కదలాలి
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ ప్రతి నాయకుడు ముందుకు వెళ్లాలని రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు జగన్మోహన్ రాజు తెలియజేశారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజంపేటలోని బైపాస్ ఎన్టీఆర్ సర్కిల్, ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఉన్నతమైనదిగా ఉన్నది అంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి అని చెప్పారు.

సంబంధిత పోస్ట్