రాజంపేట: షైనింగ్ అవార్డు ప్రదానం
రాజంపేటకు చెందిన యాకసిరి నవశ్రీ సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చావకూరి చేతులపై షైనింగ్ స్టార్ ప్రతిభ పురస్కారం అందుకున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో రాజంపేటలో రాజు విద్యాసంస్థల్లో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించి, పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ యాకసిరి హరినాధ్ కుమార్తె నవశ్రీ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకుంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆ విద్యార్థినినీ అభినందించారు.