రాయచోటి టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి బుధవారం రామాపురం మండలం, హసనాపురం గ్రామంలో ఇరుగులమ్మ దేవత జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ రెడ్డి కి ఇరుగులమ్మ తల్లి జాతర నిర్వాహకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీప్రసాద్ రెడ్డి ఇరుగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.