సంక్రాంతి సెలవులకు తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. గురువారం రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నుంచి వచ్చే వారికి 400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సులలో సాధారణ చార్జీలు మాత్రమే వసూలు చేస్తారని ఆయన అన్నారు. జనవరి 9 నుండి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.