రాయచోటి: బైక్ ను ఢీకొన్న బొలెరో వాహనం

71చూసినవారు
రాయచోటి: బైక్ ను ఢీకొన్న బొలెరో వాహనం
రాయచోటి పట్టణ పరిధిలోని చిత్తూరు రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం శనివారం రాత్రి చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. స్థానికుల వివరాల మేరకు, రింగ్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనంలో వెళ్తున్న శెట్టిపల్లి వడ్డీపల్లి చెందిన బాలాజీని బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టిందని తెలిపారు. బాలాజీకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్