హోలీ పండుగ సందర్భంగా సామాజిక మాధ్యమాలలో వదంతులు వ్యాప్తి చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. రాయచోటి పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హోలీలో చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని సహజ రంగులను చల్లుకోవాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనాలలో వీధులలో తిరగడం, భారీ శబ్దాలు చేయడం అనుమతించబోమని ఆయన అన్నారు.