సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. రాయచోటిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కోడిపందేలు, పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కోడిపందేలు, పేకాట, గుండాట, చక్కా బొమ్మ ఇలా ఏ జూద వ్యసనమైనా ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు.