సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సు యజమానులు ప్రయాణికుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ హెచ్చరించారు. ప్రైవేటు బస్సు చార్జీలు ఆర్టిసి బస్సు చార్జీలతో సమానంగా ఉండాలని శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిక చార్జీలు వసూలు చేసే ప్రైవేటు బస్సు యాజమాన్యంపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.