వేసవి నేపథ్యంలో ప్రజలు వడ దెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ సూచించారు. రాయచోటి పట్టణంలోని కె. రామాపురంలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎండ వేడిమి నుంచి సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వడ దెబ్బకు గురి కాకుండా ముందస్తు చర్యలపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.