రాయచోటి: వైభవంగా భైరవ స్వామి తిరునాల

81చూసినవారు
రాయచోటి: వైభవంగా భైరవ స్వామి తిరునాల
రాయచోటి మండల పరిధిలోని యండపల్లె గ్రామం బోయపల్లె వద్ద వెలసిన శ్రీభైరవ స్వామి తిరునాలమంగళవారంతో ముగిసింది. స్వామి వారిని పుష్పాలు, ఆభరణాలతో అలంకరించారు. ఈ వేడుకకు పెద్దఎత్తున వచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో స్వామివారిని దర్శించుకుని బోనాలు సమర్పించుకున్నారు. చాందినీ బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్