దార్తి ఆబా జన్ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లాలో ఎంపిక కాబడ్డ 04 మండలాలలోని 17 గ్రామాలలో జూన్ 15 నుండి 30 వరకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో నిర్వహింపబడే ఈ కార్యక్రమంలో పక్కాగా అమలు కావాలని అధికారులను ఆదేశించారు.