అన్నమయ్య జిల్లాలో ఎంపిక కాబడ్డ 4 మండలాలలోని 17 గ్రామాలలో జూన్ 15 నుండి జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దార్తి ఆబా జన్ జాటియ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితర కార్డులు లేని లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ 4 మండలాల ఎంపీడీఓలను మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ లో ఆదేశించారు.