రాయచోటి: చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

59చూసినవారు
రాయచోటి: చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి మండలం పెమ్మాడపల్లి అంగన్వాడి కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతోందనీ, అంగన్వాడి టీచర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్