రాష్ట్రంలో తల్లుల కోసం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాయచోటి టిడిపి కార్యాలయంలో శనివారం ఘనంగా సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మండల మహిళ టీడిపి నాయకులు, పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టిడిపి మహిళా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం హామీ నెరవేర్చారని అన్నారు.