ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్లు ఇచ్చే రుణాలు మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని విసి హాల్ నందు ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఆర్దిక సంవత్సరం 690 యూనిట్లకు గాను 11 కోట్ల 97 లక్షల రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.