వైసీపీ ప్రభుత్వంలో 32 వేల మంది మహిళలు అపహరించారని చెప్పి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క మహిళనైనా వెనక్కు తీసుకొచ్చావా అని పవన్ కళ్యాణ్ ను రాజంపేట వైసీపీ మహిళా నేత మిరియాల సురేఖ మంగళవారం ప్రశ్నించారు. కూటమి పాలనలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసన తెలుపుతూ రాయచోటిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.