అన్నమయ్య జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీరాము తో ఇటీవల నూతనంగా, ఏకగ్రీవంగా ఎన్నికైన నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథి గా కడప జోనల్ అధ్యక్షులు వినోద్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీరాము మాట్లాడుతూ ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలున్నా తన దృష్టి కి తీసుకువస్తే తప్పకుండా పరిష్కారం చేస్తానని తెలిపారు.