ప్రభుత్వ భూములలో ఆక్రమణలు తొలగించకపోతే ఉద్యమాలు చేస్తామని సిపిఐ నాయకులు అన్నారు. గురువారం గాలివీడు మండలంలో గేటు దగ్గర ఆక్రమణలకు గురైన ఆర్ అండ్ బి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 2266 లో ఇష్టానుసారంగా వాటాలు పంచుకొని ఆక్రమించారని ఆరోపణ చేశారు. ఆక్రమణదారులపై వెంటనే కేసు నమోదు చేయాలని, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరారు.