చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో గురువారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ కు దీపావళి రోజు కూడా ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించక పోవడంతో ప్రజలు అధిక సంఖ్యలో ప్రజా దర్బార్ కు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి అధికారులను చర్యలు తీసుకోవాలని కోరారు.