రాయచోటి: రైతులకు 90% సబ్సిడీతో విత్తనాలు

65చూసినవారు
రాయచోటి: రైతులకు 90% సబ్సిడీతో విత్తనాలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు అన్ని రకాల పంటలకు నాణ్యమైన విత్తనాలు 90% సబ్సిడీతో తక్షణమే ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఏపి రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు ఇప్పటి వరకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

సంబంధిత పోస్ట్