రాయచోటిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు రాయచోటి మదనపల్లి మార్గంలోని, ఇస్తిమా మైదానానికి సమీపన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ - ఇన్నోవా ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.