రాయచోటి: 'జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి'

75చూసినవారు
రాయచోటి: 'జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి'
ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన విధంగా నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయొద్దని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్