రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి లోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు ప్రజలు భారీగా వచ్చి వినతి పత్రాలు సమర్పించారు. సమస్యలను విన్న మంత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అప్పటికప్పుడే బాధితుల సమస్యలు పరిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్ లో ఎక్కువగా భూ సమస్యలు వచ్చాయని, భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కరించాలని సూచించారు.