రాయచోటి: అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలి

71చూసినవారు
రాయచోటి: అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలి
రాష్ట్రంలో జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో పని చేస్తోన్న ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరాజు, హైమ రావులు స్కూల్ ఎడ్యుకేషన్ జేడీ పయ్యావుల పార్వతికి బుధవారం రాయచోటిలో వినతి పత్రం సమర్పించారు. కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులు వారి కుటుంబాలకు దూరంగా ఉన్న దృష్ట్యా వేసవి సెలవులలో బదిలీలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్