రాయచోటి: హరినాథ్‍ పై వైసీపీ నేత దాడి చేయడం దురదృష్టకరం

80చూసినవారు
రాయచోటి: హరినాథ్‍ పై వైసీపీ నేత దాడి చేయడం దురదృష్టకరం
చిత్తూరులోని కృష్ణాపురంలో టీడీపీ నేత హరినాథ్‍ పై వైసీపీ నేత కత్తితో దాడి చేయడం దురదృష్టకరం అని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ ఘోర ఓటమితో వైసీపీ నాయకులు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని, దాడిలో గాయపడ్డ హరినాథ్‍ కు పార్టీ పరంగా అండగా ఉంటాం అని అన్నారు. కూటమి నాయకులు సంయమనం పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్