వేగం కంటే జీవితం అమూల్యమైనది అని వాహనాలు నడిపే వారికి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మంగళవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి వేగం నేరమని వాహనదారులను ఆయన హెచ్చరించారు. జీవితంలో వేగంగా ఎదగండి కానీ వాహనాలు నడిపేటప్పుడు నిదానమే ప్రధానం అని ఆయన అన్నారు. ఇంటిలో తమకోసం ఎదురుచూసే వారు ఉన్నారు అనుకొని సురక్షితంగా ఇంటికి చేరడమే లక్ష్యంగా వెళ్లాలని ఆయన సూచించారు.