ఈనెల 14న జిల్లా వ్యాప్తంగా ప్రతి సచివాలయం పరిధిలో ఇప్పటికే గుర్తించిన ప్రదేశాలలో మాస్ యోగా కార్యక్రమాన్ని తప్పని సరిగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సంబంధిత అధికారులను శుక్రవారం ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్లు, ఆర్డిఓ, తాసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులతో జేసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై దిశా నిర్దేశం చేశారు.