రాయచోటి: నీటి ఎద్దడి నివారణకు చర్యలు

82చూసినవారు
రాయచోటి: నీటి ఎద్దడి నివారణకు చర్యలు
వేసవి దృష్ట్యా జిల్లాలో నీటి ఎద్దడి నివారించడానికి తాత్కాలిక ప్రణాళిక ద్వారా అవసరమైన గ్రామాలలో నీటి రవాణాకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, పిఆర్, ఎస్సీ కార్పొరేషన్, జి ఎస్ డబ్ల్యూ ఎస్, పంచాయితీ తదితర శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్